![]() |
![]() |

జబర్దస్త్ బుల్లితెర మీద అలరిస్తున్న బెస్ట్ కామెడీ షో. ఇక ఈ షోలో ఎంతో మంది జడ్జెస్ మారుతూ వచ్చారు. ఐతే కొన్ని వారాలుగా స్థిరంగా ఇంద్రజ, కమెడియన్ కృష్ణ భగవాన్ జడ్జెస్ గా కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేశారు. మధ్యలో కమెడియన్ పరదేశి స్టేజి పైకి వచ్చి.. "సూపర్ మచ్చి" పాటకు డాన్స్ చేస్తున్నట్లుగా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో జడ్జి ఇంద్రజ అందుకుని "తవ్వకమే..తవ్వకం..ఒకటే తవ్వకం..ఏం తవ్వుతున్నారు" అని ఇంద్రజ అడిగేసరికి కృష్ణభగవాన్ మాత్రం ‘అయినా బాగుంది’ అనేసరికి .
దీంతో ఇంద్రజ.. “అంతకంటే వరస్ట్ గా ఈయన చేస్తారు కాబట్టి బాగుంది అంటున్నారు” అని కృష్ణభగవాన్ ని చూపిస్తూ కౌంటర్ వేసింది. తర్వాత నూకరాజు స్కిట్ లో ఇంద్రజ ఆటోలో వెళ్లే క్లిప్ చూపించారు. "అదేంటి అమ్మ ఆటోలో వెళ్తోంది" అని పరదేశి అనేసరికి "అడిగిన వాళ్లందరికీ అన్నీ ఇచ్చేస్తూ ఉంటే మరి డబ్బుల్లేక చివరికి ఆటోలో వెళ్తున్నారు" అని అన్నాడు నూకరాజు. ఇల్లా ఈ వారం స్కిట్స్ అన్ని కూడా ఎంటర్టైన్ చేయబోతున్నాయి.
![]() |
![]() |